Bullet Train | బీజింగ్, డిసెంబర్ 29: ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే హైస్పీడ్ బుల్లెట్ రైలు నమూనాను చైనా ఆదివారం ఆవిష్కరించింది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హైస్పీడ్ రైలును బుల్లెట్ ట్రెయిన్‌ను మరింత ఆధునీకరించి తయారుచేసినట్టు దీని తయారీదారులు ప్రకటించారు.
సీఆర్450గా ఈ కొత్త మోడల్‌ను చైనా స్టేట్ రైల్వే గ్రూపు కంపెనీ(చైనా రైల్వే) వ్యవహరిస్తోంది. ఈ కొత్త మోడల్ బుల్లెట్ ట్రెయిన్‌తో ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రస్తుతమున్న హైస్పీడ్ రైలు గంటకు 350 కి.మీ వేగంతో ఉందని, ఇది 100 కి.మీ ఎక్కువని చైనా ప్రకటించింది.