బీజింగ్: గత ఏడాది నవంబర్లో ఓ వ్యక్తి చైనాలోని జుహాయ్ సిటీలో కారుతో బీభత్సం సృష్టించాడు. ఆ దాడిలో 35 మంది మృతిచెందారు. ఆ కేసుతో లింకున్న 62 ఏళ్ల ఫాన్ వెగుయి అనే వ్యక్తికి చైనా మరణశిక్ష(China Execution) అమలు చేసింది. స్టేడియం బయట వ్యాయామాలు చేస్తున్న వారిపై అతను కారును డ్రైవ్ చేశాడు. ఆ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.
కారు ఘటన తర్వాత కొన్ని రోజులకు జరిగిన మరో ఘటనలో 21 ఏళ్ల జూ జియాజిన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి 8 మందిని పొట్టనపెట్టుకున్నాడు. వూజి సిటీలో ఆ ఘటన జరిగింది. అయితే ఆ కేసులో నిందితుడిగా ఉన్న జియాజిన్ను కూడా సోమవారం మరణశిక్ష అమలు చేశారు.
భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత జరిగిన ఆస్థి పంపకాల విషయంలో అసంతృప్తితో ఉన్న ఫాన్ అనే వ్యక్తి ఆవేశంలో తన కారుతో జనంపై దూసుకెళ్లిన చైనా పోలీసులు తేల్చారు. ఇక జియాజిన్ అనే వ్యక్తి .. పరీక్షలు సరిగా రాయలేక, డిప్లామా పొందలేక, ఆ ఆవేదనతో అతను కత్తితో దాడికి దిగినట్లు చైనా కోర్టు తెలిపింది.
సాధారణంగా చైనాలో మరణశిక్షను అమలు చేసేందుకు తుపాకీ వాడుతారు. ఇటీవల కాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్లు వినియోగిస్తున్న తెలుస్తోంది.