బీజింగ్: హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్భందించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా రియాక్ట్ య్యింది. ఇరానీ నౌకాశ్రయాలను మూసివేయడం ప్రమాదకరమని, బాధ్యతారాహితం అవుతుందని చైనా పేర్కొన్నది. నౌకలను అడ్డుకోవడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని చైనా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి గూవో జియాకున్ తెలిపారు. రెండు వర్గాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని, జలసంధి వద్ద అమెరికా తన బలగాల సంఖ్యను పెంచుతోందని, టార్గెట్ చేసి నౌకలను బ్లాక్ చేస్తున్నదని, దీంతో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉన్నట్లు జియాకున్ తెలిపారు.
సీజ్‌ఫైర్‌ను గౌరవించాలని అన్ని దేశాలను చైనా కోరింది. చర్చలకు కట్టుబడి ఉండాలని చెప్పింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆచరణాత్మక అడుగులు వేయాలని గూవో తెలిపారు. మరోవైపు మంగళవారం అమెరికా అనుమతితో ఓ చైనీస్ ట్యాంకర్ హోర్ముజ్ జలసంధి దాటింది. ద రిచ్ స్టారీ అనే నౌక ఆ జలసంధి దాటినట్లు తెలుస్తోంది. మెరైన్ ట్రాఫిక్ అండ్ కెప్లెర్ డేటా ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. ఆ ట్యాంకర్ షాంఘై జువాన్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందినది. మీడియం రేంజ్ ట్యాంకర్ ఇది. దీంట్లో రెండున్నర లక్షల బ్యారళ్లుఇంధనం పడుతుంది.
పశ్చిమాసియా శాంతి, స్థిరత్వం కోసం నాలుగు సూత్రాల ప్రతిపాదన చేశారు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. అబుదాబి ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జయిదాతో బీజింగ్‌లో భేటీ అయిన సందర్భంగా జిన్‌పింగ్ ఆ నాలుగు పాయింట్ల గురించి చెప్పారు. శాంతియుత సహజీవనం, జాతీయ సౌర్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, అభివృద్ధి-భద్రత సహకారానికి కట్టుబడి ఉండాలని జిన్‌పింగ్ తెలిపారు.