శాంటియాగో: ఓ పిల్లాడి చేష్టలు తెగ నవ్వులు తెప్పిస్తోంది. చిలీ దేశాధ్యక్షుడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో.. చిన్న సైకిల్‌పై ఉన్న ఓ చిన్నారి .. దేశాధ్యక్షుడు చుట్టూ చక్కర్లు కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. సూపర్‌మ్యాన్ తరహాలో డ్రెస్సు వేసుకున్న పిల్లోడు.. బ్లూకలర్ సైకిల్‌పై రైడింగ్ చేశాడు. రాజ్యాంగ సవరణపై ఇటీవల చిలీలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దానిపై జరిగిన ఎన్నికల్లో ఓటేసిన తర్వాత అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో పక్కన ఉన్న ఓ చిన్నారి తన సైకిల్‌పై బోరిక్ చుట్టు తిరిగేశాడు. కొన్ని రౌండ్లు తిరిగిన తర్వాత బోరిక్ మాటలు విన్న ఆ చిన్నారి.. ఆ తర్వాత మళ్లీ తనదైన స్టయిల్లో సైకిల్‌తో ఆడుకున్నాడు. ఈ వీడియోకు ట్విట్టర్లో లక్షల్లో లైక్‌లు వచ్చాయి. కొందరు కామెంట్లతో హోరెత్తించారు. అయితే రాజ్యాంగ సవరణ ముసాయిదా తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతికూలంగా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
Superman encircles Gabriel Boric after he submits his vote in today’s plebiscite 🇨🇱 pic.twitter.com/2Tk63noO62
— David Adler (@davidrkadler) September 4, 2022