Australia : ఆస్ట్రేలియాలోని ఒక ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగం ప్రమాదానికి దారి తీసింది. సిడ్నీలోని మ్యాన్లీ వెస్ట్ పబ్లిక్ స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం 1ః20 గంటలకు వంటసోడా, చక్కెరతో బ్లాక్ స్నేక్ ప్రయోగం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 13మంది పిల్లలతో పాటు ఒక టీచర్ గాయపడ్డారు. వీళ్లలో ఇద్దరు పిల్లలకు మాత్రం ముఖం, ఛాతీ మీద కాలిన గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని హెలికాప్టర్లో వెస్ట్మీడ్ పిల్లల దవాఖానకు తరలించారు. మిగతావాళ్లకు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కొందరు పిల్లలు ఆరుబయట వంట సోడాతో బ్లాక్ స్నేక్ లేదా షుగర్ స్నేక్ ప్రయోగం చేస్తున్నారు. ఆ సమయంలో గాలి బలంగా వీచడంతో వంటసోడా, చక్కెర, ఉత్ప్రేరకం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిని విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం వెంటనే ప్రథమ చికిత్స చేసింది.
బ్లాక్ స్నేక్ ఎలా వస్తుందంటే..
వంట సోడా, చక్కెర, ఉత్ప్రేరకం కలిపిన మిశ్రమాన్ని వెలిగిస్తే పాము లాంటి ఆకారం బయటికి వస్తుంది. వంటసోడాని వేడిచేసినప్పుడు కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుంది. ఈ గాలి చక్కెరలో ఉన్న కార్బోనేట్ మీద ఒత్తిడి పెంచుతుంది. దాంతో, ఆ పాత్రలోంచి నల్లని పాములాంటి ఆకారం బయటికి వస్తుంది. దీన్నే బ్లాక్ స్నేక్ లేదా షుగర్ స్నేక్ ప్రయోగం అంటారు.