చికాగో: అమెరికాలోని చికాగోలో ఇటీవల కాల్పుల ఘటనలు(Chicago Attacks) చోటుచేసుకున్నాయి. శుక్రవారం నుంచి జరిగిన ఆ ఘటనల్లో సుమారు ఏడు మంది మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. అమెరికాలో అతిపెద్ద మూడవ నగరమైన చికాగోలు జరుగుతున్న హింసాత్మక ఘటన పట్ల అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆ సిటీలో మిలిటరీని ప్రవేశపెట్టేందుకు ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సిటీలో సుమారు 20కు పైగా ప్రదేశాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ ప్రదేశంలో సామూహిక కాల్పుల ఘటన జరిగింది. అక్కడ 12 మంది గాయపడ్డారు. ఓ ఎస్యూవీ నుంచి వ్యక్తి గన్తో ఫైరింగ్ చేశాడు. చికాగోలో పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడ ఆందోళనకరంగా మారింది. చికాగోను సురక్షిత నగరంగా మార్చగలనని తన ట్రుత్ సోషల్ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు.