న్యూఢిల్లీ : ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, ఎక్స్ గ్రోక్, గూగుల్ జెమిని తదితర ఏఐ ప్లాట్‌ఫామ్ సేవల్లో ఏకకాలంలో అంతరాయం ఏర్పడింది. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో భారత్‌తో పాటు యూకే, ఫ్రాన్స్, తుర్కియే, బెల్జియం, జార్జియా, గ్రీస్, స్పెయిన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయని డౌన్‌డిటెక్టర్ సంస్థ తెలిపింది.
చాట్ జీపీటీ, జెమిని వాటిల్లో లాగిన్, వెబ్సైట్ యాక్సెస్, లేటెన్సీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. చాట్ జీపీటీలో ఎక్కువగా ఈ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలపై టెక్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. కాగా ఒకేసారి అన్ని పేజీల్లో సమస్యలు రావడంపై ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనుమానాలు రేకెత్తాయి.