Morocco earthquake: సీసీకెమెరాల్లో మొరాక్కో భూకంపం.. వైరల్ అవుతున్న వీడియోలు
Morocco earthquake: మొరాక్కోలో పరిస్థితి భయానకంగా ఉంది. రాత్రి వచ్చిన భూకంపంతో ప్రజలు అల్లడిపోతున్నారు. 6.8తో వచ్చిన తీవ్రత వల్ల అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద వేల సంఖ్యలో జనం చిక్కుకున్నారు. ఆన్లైన్లో సీసీ కెమెరాలకు చిక్కిన వీడియోలను పోస్టు చేస్తున్నారు.
మర్రాకెచ్: మొరాక్కోలో వచ్చిన భారీ భూకంపం(Morocco earthquake)లో సుమారు ఏడు వందల మంది మరణించారు. అయితే ఆ బీభత్సానికి చెందిన వీడియోలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల చాలా నగరాల్లో బిల్డింగ్లు కూలిపోయాయి. మర్రాకెచ్ నగరంలో ఆ ప్రకృతి చేసిన నష్టం మరీ ఎక్కువగా ఉంది. ఓ బిల్డింగ్ కూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. రాత్రి 11 గంటల సమయంలో భూకంపం సంభవించింది. అయితే ఆ సమయంలో ఓ బిల్డింగ్ వద్ద ఉన్న జనం అటూ ఇటూ పరుగులు తీశారు. ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం ఉరకలు పరుగులు పెట్టారు. భూకంప బాధితుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది.
https://twitter.com/iamAkramPRO/status/1700352568944152752?s=20
వేల సంఖ్యలో జనం భూకంప భయంతో రాత్రంతా ఆరుబయటే గడిపారు. ఇక ఇంటర్నెట్లో తాము తీసిన వీడియోలను పోస్టు చేస్తూనే ఉండిపోయారు. దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయినట్లు తెలుస్తోంది. కోస్టల్ నగరాలు కాసాబ్లాంకా, ఎసౌరియాలోనూ ప్రకంపనలు నమోదు అయినట్లు చెబుతున్నారు.
https://twitter.com/BotNews18/status/1700305298517315741?s=20
🚨🇲🇦People are outside after the terrifying 7.1 earthquake in all Moroccan cities. 😥 PRAY FOR MOROCCO!#earthquake #seisme #زلزال_المغرب#Morocco #earthquake #moroccoearthquake #deprem #زلزال #زلزال_المغرب #fas #fas_depremi #morocco #maroc #earthquake pic.twitter.com/1wf1n19VmQ
— معاذ شاہین (@MaazShaheen4) September 9, 2023
https://twitter.com/iamAkramPRO/status/1700306064539852996?s=20
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

