బెర్లిన్: జర్మనీ(Germany)లోని మాగ్డేబర్గ్ సిటీలో.. ఓ డాక్టర్ తన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. క్రిస్టమస్ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్కెట్లోకి కారుతో దూసుకెళ్లాడు. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కారుతో జనంపై దూసుకెళ్లిన ఆ ఉన్మాదిని ఓ డాక్టర్‌గా గుర్తించారు. అతని పేరు అల్ అబ్దుల్మోషెన్. అతని స్వంత దేశం సౌదీ అరేబియా. 2006 నుంచి అతను జర్మనీలో ఉంటున్నాడు.
Update on German Christmas Market attack
Mans name is Al Abdulmohsen, he is from Saudi Arabia and he has been in Germany since 2006 as a doctor in Psychiatry at a correctional facility in Bernberg, he is 50 years old.
He rented a BMW and then plowed into the crowd.
Two people… https://t.co/aRD4WZpsSZ pic.twitter.com/e9Ki0HT59s
— 𝕲𝖊𝖗𝖒𝖆𝖓𝖎𝖈 𝕱𝖗𝖊𝖓 (@DeutscherJ1776) December 21, 2024
బెర్న్బర్గ్లో ఉన్న ఓ ఆస్పత్రిలో సైకియాట్రీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బీఎండబ్ల్యూ కారును కిరాయి తీసుకున్న అతను.. జనంపైకి డ్రైవ్ చేశాడు. ఆ ఘటనలో 68 మంది గాయపడ్డారు. 50 ఏళ్ల ఆ డాక్టర్‌ను అరెస్టు చేశారు. అతను ఒక్కడే ఆ దాడికి దిగాడా లేక అతనేమైనా ఉగ్ర చర్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో విచారణ జరుగుతున్నది.
The assassin: A 50 year old doctor from Saudi Arabia who lived and worked for 20 years in Germany.
Once a muslim, always a muslim.
That will never change.Also in the Netherlands we should worry.#Magdeburg https://t.co/3E1H2EhYur
— William J. Legerstee 🇳🇱🇮🇱🇵🇭 (@WillemLegerstee) December 20, 2024
దాడికి దిగిన ఆ డాక్టర్.. ఇస్లామిక్ తీవ్రవాది అన్న అనుమానాలు లేవని జర్మనీ అధికారులు చెబుతున్నారు. అతనికి చెందిన సోషల్ మీడియా పోస్టుల్లో .. అతను ఇస్లామ్‌ను విమర్శిస్తున్నట్లు ఉందన్నారు. దాదాపు 400 మీటర్ల దూరం వరకు కారును జనంపైకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.