Joe Biden | బైడెన్ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు.. అమెరికా అధ్యక్షుడికి తప్పిన ముప్పు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆదివారం రాత్రి 8.09 గంటలకు డెలావర్‌లోని విల్మింగ్టన్లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆదివారం రాత్రి 8.09 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) డెలావర్‌లోని (Delaware) విల్మింగ్టన్లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ (Convoy) వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటన జరిగినప్పుడు జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా.. ప్రెసిడెంట్ బైడెన్ 130 అడుగుల దూరంలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు తరలించారు. దంపతులిద్దరు క్షేమంగా ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించారు. కాగా, ఘటనకు పాల్పడిన డ్రైవర్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | US President Joe Biden rushed into his vehicle as a car crashed into a vehicle attached to his motorcade.
(Source: Reuters) pic.twitter.com/2ooVcY0BQo
— ANI (@ANI) December 18, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

