కాలిఫోర్నియా, జనవరి 30: కారును రెగ్యులర్గా శుభ్రం చేస్తున్నప్పటికీ, క్యాన్సర్ కారక రసాయనం నుంచి తప్పించుకునే అవకాశం ఉండదని తాజా అధ్యయనం వెల్లడించింది. కారులో ఉండే అటువంటి రసాయనాలను పారద్రోలడం, తుడిచివేయడం సాధ్యం కాదని పేర్కొన్నది. అధ్యయన వివరాలు ఎన్విరాన్మెంట్ రీసర్చ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కారులో ఎంత దూరం ప్రయాణం చేస్తే, అంత ఎక్కువగా ఈ రసాయనం బారిన పడే అవకాశం ఉందని చూపించే సంబంధిత అధ్యయనాన్ని ఇది అనుసరించింది. ఆటోమొబైల్ సీట్ ఫోమ్(సీటు సౌకర్యంగా ఉండేందుకు తయారీలో వినియోగించే మెత్తటి మెటీరియల్)లో టీడీసీఐపీపీ లేదా క్లోరినేటెడ్ ట్రిస్ అనే కెమికల్ ఫ్లేమ్ రిటార్డెంట్ను ఎక్కువగా వినియోగిస్తారు. టీడీసీఐపీపీ కాలిఫోర్నియా ప్రోప్.65 జాబితాలో ఉండడంతో పాటు క్యాన్సర్ కారకమైనది.