నోటీసులు.. దర్యాప్తు.. ఆపైనే చర్యలు.. నేరం చేశారని అరెస్ట్ చేయరాదు
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నోటీసులు జారీచేసి దర్యాప్తు చేపట్టిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఏడేండ్ల్ల వరకు శిక్షపడే నేరాల్లో నేరం చేశారన్న కారణంతోనే నేరుగా అరెస్టు చేయరాదని, బీఎన్ఎస్ఎస్- 2023లోని సెక్షన్ 35(3) కింద నోటీసు జారీచేసి దర్యాప్తు కొనసాగించాలని స్పష్టంచేసింది.
- పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ
- మన్నె క్రిశాంక్‌కు ఊరట
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నోటీసులు జారీచేసి దర్యాప్తు చేపట్టిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఏడేండ్ల్ల వరకు శిక్షపడే నేరాల్లో నేరం చేశారన్న కారణంతోనే నేరుగా అరెస్టు చేయరాదని, బీఎన్ఎస్ఎస్- 2023లోని సెక్షన్ 35(3) కింద నోటీసు జారీచేసి దర్యాప్తు కొనసాగించాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు అర్నేశ్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేరొంది. క్రిశాంక్ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ టీ మాధవీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. హైదరాబాద్ సిటీ డీసీపీ(క్రైమ్స్) క్రిశాంక్‌కు సెక్షన్ 35(3) కింద నోటీసు జారీచేసి దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషారెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఫార్మా కంపెనీల యాజమాన్యంపై వివిధ సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేశారంటూ టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ సోమవారం హైదరాబాద్ సిటీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ఎస్-2023లోని సెక్షన్లు 353(2), 352 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ, ప్రాథమిక దర్యాప్తు నిర్వహించకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. పిటిషనర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని, సోమవారం నుంచి సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఆయనను అనుసరిస్తున్నారని, ఇంటి పరిసరాల్లో మోహరించారని, అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజే ప్రతివాదన చేస్తూ, ఎఫ్ఐఆర్ సోమవారం నమోదైందని, దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున పిటిషనర్‌కు ఉపశమనం కల్పించవద్దని కోరా రు. స్పందించిన హైకోర్టు.. లలితాకుమారి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. ఎఫ్ఐఆర్ నమోదు ముందు దర్యాప్తు నిర్వహించాల్సిన అం శాన్ని పేరొంది. నోటీసులు జారీచేసి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తునకు క్రిశాంక్ సహకరించాలని స్పష్టం చేసింది. పిటిషన్‌పై విచారణ ముగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

