టొరంటో, డిసెంబర్ 22: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. సొంత పార్టీ ఎంపీల నుంచే ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కోరుతూ తాజాగా భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య ప్రధాని ట్రూడోకు లేఖ రాశారు. పదవి నుంచి తప్పుకోవలసిన సమయం ఆసన్నమైందని లేఖలో స్పష్టం చేశారు.
ట్రూడో స్థానంలో బాధ్యతలు చేపట్టడానికి మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ సమర్థురాలని చంద్ర తన లేఖలో ప్రతిపాదించారు. జస్టిస్ ట్రూడో రాజీనామా కోరుతూ ప్రతిపక్ష పార్టీలు ఏకమైన నేపథ్యంలో ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ ఆయనపై సొంత పార్టీ నుంచి ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి.