Canada | ఒట్టావా, డిసెంబర్ 18 : శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనల్ని మరింత కఠినతరం చేయనున్నట్టు కెనడా ప్రకటించింది. ‘ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ’ విధానంలో జరుగుతున్న మోసాల్ని అరికట్టేందుకు.. వలస విధానంలో సమగ్రతను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపింది. జాబ్ ఆఫర్‌తో శాశ్వత, తాత్కాలిక నివాసాన్ని కోరుకుంటున్న దరఖాస్తుదారులకు సంబంధించి ‘అదనపు పాయింట్స్’ను తొలగించబోతున్నది.
దీంతో కెనడాకు వెళ్లే లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, ఆ దేశంలో తాత్కాలిక నివాస హోదా కలిగిన కార్మికులపై తీవ్ర ప్రభావం పడనున్నది. కెనడా మంత్రి మార్క్ మిల్లర్ విలేకర్ల సమావేశంలో నిబంధనల్లో మార్పులపై కీలక ప్రకటన చేశారు.