టొరంటో: కెనడా కేంద్రంగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని మన దేశం ఇన్నాళ్లుగా వ్యక్తం చేసిన ఆందోళనను పెడచెవిన పెట్టిన ఆ దేశ ప్రభుత్వం తొలిసారిగా తమ దేశంలోని ఖలిస్థానీ అతివాద గ్రూప్లు నడుస్తున్నాయని, వాటికి ఆర్థిక సహాయం కూడా తమ దేశం నుంచే అందుతున్న విషయాన్ని అంగీకరించింది.
కెనడా ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం కేటగిరీలో ఉన్న హమాస్, హెజ్బొల్లా, ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాద గ్రూపులు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటివి ఆర్థిక సహాయం పొందుతున్నాయని పేర్కొంది. ఈ సిక్కు సంస్థలు అక్కడ స్థిరపడిన భారత సమూహాల నుంచి విరాళాలు సేకరించడమే కాక, లాభేతర సంస్థల నుంచి నిధులు సేకరిస్తున్నాయి.