కీవ్: అలినా కబేవా. ఈమె రష్యా జిమ్నాస్ట్. 2004 ఏథేన్స్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ విన్నర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో 2008 నుంచి కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. పుతిన్ గర్ల్‌ఫ్రెండ్ అలినా అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈమె స్విట్జర్లాండ్‌లో తలదాచుకుంది. కబేవాకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారంతా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని ఓ లగ్జరీ విల్లాలో ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ నుంచి కబేవాను వెళ్లగొట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 50 వేల మంది ఓ పిటిషన్‌పై కూడా సంతకం చేశారు. పుతిన్ లవర్‌ను దేశం నుంచి తరిమేయాలని ఉక్రెయిన్, బెలారస్, రష్యాకు చెందిన కొందరు పిటిషన్‌పై సంతకం చేశారు.
ప్రస్తుం అలినా వయసు 38 ఏళ్లు. ఆమె పుతిన్ లవర్ అని అందరూ అంటున్నా.. రష్యా అధ్యక్షుడు మాత్రం ఎప్పుడూ ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పలేదు. ఉక్రెయిన్ వార్ మొదలవ్వగానే.. అలినా కబేవా స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఆరేళ్లు చేశారు. గత ఏడాది డిసెంబర్లో చివరిసారి జిమ్నాస్టిక్ టోర్నీలో ఆమె ప్రదర్శన ఇచ్చింది.