వాషింగ్టన్: కుల వివక్షకు వ్యతిరేకంగా తొలిసారిగా చట్టం చేయనున్న రాష్ట్రంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిలిచిపోనున్నది. 31-5 ఓట్ల మెజారిటీతో మంగళవారం ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. ఈ బిల్లుపై గవర్నర్ సంతకం పెడితే అది చట్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ బిల్లుపై గవర్నర్ గేవిన్ న్యూసమ్ వెంటనే సంతకం పెట్టి ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు మద్దతుదారులు నిరాహార దీక్షలు ప్రారంభించారు.