Big Bend Project | న్యూయార్క్, నవంబర్ 13: ప్రపంచంలోనే ఎత్తయిన భనవం అంటే అందరికీ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా గుర్తుకు వస్తుంది. 828 మీటర్లు (2,717 అడుగుల) ఎత్తుతో 2009 నుంచి ఈ భవనం ప్రపంచంలోనే ఎత్తైనదిగా ప్రసిద్ధి చెందింది. అయితే అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్మించనున్న ఒక ఆకాశహర్మ్యం ఈ రికార్డును తుడిచిపెట్టేయనుంది.
యూఎస్‌కు చెందిన సన్ కథనం ప్రకారం అత్యంత లగ్జరీ నివాస ఆకాశహర్మ్యాలు నిర్మించే బిలియనర్స్ రో గ్రూప్ న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ మధ్యప్రాంతంలో 4,000 అడుగుల ఎత్తుతో ఒక మహా భవనాన్ని నిర్మించనున్నది. రివర్స్ ‘యూ’ ఆకారంలో చేపట్టే ఈ బిగ్ బెండ్ ప్రాజెక్టు కనుక పూర్తయితే బుర్జ్ ఖలీఫా వెలవెలపోవడం ఖాయం. ఆధునికంగా తిరగబడ్డ ‘యూ’ ఆకారంలో నిర్మించే ఈ భవనం ఒక ఇంజనీరింగ్ అద్భుతం కానుంది.