హైదరాబాద్: గురు పున్నమి రోజున వెన్నెల మరింత దేదీప్యమానంగా వెలిగింది. ప్రపంచవ్యాప్తంగా వెన్నెల వెలుగులు చూపరుల్ని ఆకట్టుకున్నది. జూలైలో వచ్చిన ఈ సూపర్మూన్(Super Moon)ను చూసి జనం థ్రిల్ అయ్యారు. సోమవారం కనిపించిన ఆ చందమామ.. చాలా పెద్దగా.. చాలా ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. అయితే మూడు రోజుల పాటు చందమామ ఇలాగే కనిపిస్తుందని నాసా పేర్కొన్నది.
సోమవారం వచ్చిన పున్నమిని బక్ మూన్(Buck Moon) అంటారు. భూ కక్ష్యలో.. చందమామ భూమికి దగ్గర వస్తుంది. దీంతో చాలా పెద్ద సైజులో మూన్ కనిపిస్తుంది. బక్ అంటే జింకలు. ఈ కాలంలోనే జింకలకు కొమ్ములు వస్తుంటాయి. అవి పూర్తి సైజ్లో కనిపిస్తాయి. దీంతో జూలై ఏర్పడే సూపర్మూన్ను బక్ మూన్ అని కూడా అంటారు. భూ గురుత్వాకర్షణ వల్ల చంద్రుడు తన కక్ష్యలో సరైన రీతిలో ఉండడు. దీర్ఘవృత్తాకారంలో ఉంటాడు. దాని వల్లే అతను పెద్దగా కనిపిస్తాడు.
ఈస్ట్రన్ టైం ప్రకారం 12.39 నిమిషాలకు చంద్రుడు సంపూర్ణ స్థాయిలో వెలిగినట్లు ఓల్డ్ ఫార్మర్స్ ఆల్మనాక్ తెలిపింది. ఆ సంస్థ చాలా ఏండ్ల నుంచి ఆస్ట్రోనామికల్ డేటాను సేకరిస్తోంది. సాధారణంగా ఫుల్ మూన్ కన్నా.. బక్ మూన్ భూమికి దగ్గరగా కనిపిస్తుంది. ఆగస్టులో వచ్చే పున్నమి కేవలం సూపర్మూన్ మాత్రమే అవుతుందని సైంటిస్టులు తెలిపారు.