Lottery | న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోట్లు గెలుచుకుని యూకే సంపన్నుల్లో ఒకడిగా మారిపోయాడు. నేషనల్ లాటరీ టికెట్ కొన్న అతడికి ఏకంగా 177 మిలియన్ పౌండ్లు.. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.1,800 కోట్లు లభించాయి. మంగళవారం నిర్వహించిన డ్రాలో 07, 11, 25, 31, 40 నంబర్లు విజయాన్ని చేకూర్చాయి. మొత్తం యూకేలోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనట.
ఆ అదృష్టవంతుడి పేరు వెల్లడించేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఈ విజేత ఈ ఏడాది సండే టైమ్స్ సంపన్నుల జాబితాలోని మ్యుజిషియన్స్ హ్యారీ ైస్టెల్స్ (175 మిలియన్ పౌండ్లు), అడెలె (170 మిలియన్ పౌండ్లు) కన్నా ఎక్కువ సంపదను సొంతం చేసుకున్నారు. విన్నింగ్ టిక్కెట్‌ను వ్యాలిడేట్ చేసి, సొమ్ము చెల్లించిన తర్వాత, విజేత తన వివరాలను గోప్యంగా ఉంచవచ్చు, లేదా, బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. 2022 జూలై 19న జరిగిన డ్రాలో 195 మిలియన్ పౌండ్లు గెలుచుకున్న విజేత నేషనల్ లాటరీలో ప్రథమ స్థానంలో నిలిచారు.