UK to Iran on Nuke Deal | అణ్వస్త్రాల తయారీ నిలిపివేతపై అగ్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు చివరి అవకాశం ఉన్నదని బ్రిటన్ తేల్చి చెప్పింది. ఇరాన్ చర్చల ప్రతినిధులు సీరియస్ ప్రతిపాదనలతో చర్చలకు వస్తే ఉపయోగం ఉంటుందని ఆదివారం పేర్కొంది. అణ్వాయుధాల తయారీని నిలిపివేసేందుకు బారక్ ఒబామా హయాంలో ఇరాన్‌తో అమెరికా, దాని మిత్ర దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కానీ ట్రంప్ హయాంలో ఆ ఒప్పందాన్ని రద్దయింది. నాటి నుంచి ఇరాన్‌తో ప్రపంచ దేశాలకు వాణిజ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి లిజ్ ట్రస్ స్పందించారు. అణ్వాయుధం తయారు చేసేందుకు ఇరాన్‌ను అనుమతించబోమని స్పష్టం చేశారు. జేసీపీవోఏ షరతులకు తలొగ్గి.. సీరియస్ ప్రతిపాదనలతో చర్చలకు వస్తే.. అమెరికా, దాని మిత్ర దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి అవకాశం ఉందని తేల్చేశారు.