ఉక్రెయిన్‌కు బ్రిటన్ చేయిచ్చింది. రష్యాకు వ్యతిరేకంగా తమ సేనలను రంగంలోకి దింపలేమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని రష్యా సేనలతో తాము యుద్ధం చేయలేమని స్పష్టం చేశారు.
‘నేను ఓ విషయం స్పష్టం చేయదలిచాను. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా సేనలతో పోరాటం చేయం. టాపాలో సైన్యాన్ని మోహరించడం అనేది కేవలం ఆత్మరక్షణ చర్యే. ఈ దళాలు నాటో సభ్య దేశపు సరిహద్దుల్లోనే వున్నాయి.’ అని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్ల బంధువులకు యూకే వీసాలు అందజేశారు. వారికి సంబంధించిన బంధువులు ముందు నుంచీ ఎవరైతే బ్రిటన్‌లో ఉంటారో.. వారందరూ అక్కడి నుంచి బ్రిటన్‌కు రావొచ్చని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.