లండన్, ఆగస్టు 15: కొవిడ్-19 మూల వైరస్‌తో పాటు, ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేసే బైవాలెంట్ వ్యాక్సిన్‌కు తొలిసారిగా బ్రిటన్ అనుమతులు మంజూరు చేసింది.
ఈ టీకాను మోడెర్నా కంపెనీ అభివృద్ధి చేసింది. భద్రత, నాణ్యత, సమర్థత తదితర పరీక్షల్లో ఈ టీకా సత్ఫలితాలు ఇచ్చినట్టు మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. బూస్టర్ డోసుగా దీన్ని తీసుకోవచ్చని వివరించింది.