శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 21:39:43

ఒకేసారి ఆరు సుడిగుండాలు..!వీడియో వైరల్‌

ఒకేసారి ఆరు సుడిగుండాలు..!వీడియో వైరల్‌

లూసియానా: సముద్రంలో సుడిగుండాలు ఏర్పడడం కామన్‌. కానీ ఒకేసారి ఆరు సుడిగుండాలు ఏర్పడితే అద్భుతమే కదా.. ఇలాంటి దృశ్యం అట్లాంటిక్‌ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో, లూసియానా తీరంలో కనిపించింది. దీన్ని ఫ్రాంక్‌ లేడే అనే ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించారు. దీన్ని ఫేస్‌బుక్‌లో పెట్టగా వైరల్‌ అయ్యింది. సముద్రం పైన భయంకరమైన సుడిగుండాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యంతోపాటు ఆందోళన కూడా చెందారు. 

కాగా, గల్ఫ్‌ తీరప్రాంతంలో రెండు విపత్కర ఉష్ణమండల తుఫానులు రాబోతున్నాయని ఈ వీడియో సూచిస్తున్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.  ఒకటి ఉత్తర అట్లాంటిక్, మరొకటి కరేబియన్ దీవుల్లో ఉండొచ్చని, అవి ఒకే సమయంలో వస్తాయని అంచనా వేశారు. కనుక తీరప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo