Russia Invansion | ఉక్రెయిన్బ్రిటనర్లకు స్పెషల్ వీసా.. వెల్లడించిన బోరిస్ జాన్సన్!
Russia Invansion | రష్యా దండయాత్రతో బ్రిటన్‌లో స్థిరపడ్డ ఉక్రెయిన్ల కుటుంబ సభ్యులకు వీసా జారీ చేస్తామన్నారు బోరిస్ జాన్సన్.
Russia Invansion | రష్యా దండయాత్రతో ప్రాణాలరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ఉక్రెయిన్లకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చింది బ్రిటన్. తమదేశంలో స్థిరపడిన ఉక్రెయిన్ల కుటుంబ సభ్యులు బ్రిటన్‌కు రావచ్చునని తెలిపింది. వారికి వీసాలు జారీ చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం ప్రకటించారు. వేలాది మంది ఉక్రెయిన్లకు ఊరట కల్పించేందుకు ప్రతిపాదించిన నూతన ఉక్రెయిన్ వీసా విధానంపై వచ్చేవారంలో పార్లమెంట్లో ప్రభుత్వం వెల్లడించనున్నది.
అంతేకాదు.. ఉక్రెయిన్ సంతతి బ్రిటన్‌వాసులకు ప్రాథమిక, వైద్యపరమైన అవసరాలు తీర్చేందుకు నాలుగో కోట్ల పౌండ్ల హ్యుమానిటేరియన్ ప్యాకేజీని తెలిపారు బోరిస్ జాన్సన్. కనుక తమదేశంలో సెటిలైన ఉక్రెయిన్లు.. తమ వారిని బ్రిటన్‌కు తీసుకురావచ్చునన్నారు.
రష్యా దండయాత్రతో వేలాది మంది ఉక్రెయిన్లు నిరాశా నిస్పృహల్లో చిక్కుకున్నారని, అటువంటి వారికి తమ ప్యాకేజీతో లబ్ధి చేకూరుతుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్లకు బాసటగా నిలువాల్సిన సమయంలో తమ దేశం వెనుకడుగు వేయదని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఉక్రెయిన్ను కాపాడేందుకు ఆర్థిక, మిలిటరీ సహకారం అందిస్తామన్నారు.
రష్యా సృష్టించిన హింసతో పరారైన ఉక్రెయిన్లకు మద్దతుగా మానవత్వ నిపుణులను నియమించామని బ్రిటన్ తెలిపింది. ఈ ఏడాది ఉక్రెయిన్లను ఆదుకునేందుకు 140 మిలియన్ల పౌండ్ల ఆర్థిక సాయం ప్రకటించింది. బ్రిటన్‌లోని బ్యాంకుల నుంచి ఉక్రెయినర్లు తీసుకునే రుణాలకు 500 మిలియన్ల డాలర్ల వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని గతవారం బోరిస్ జాన్సన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

