మాస్కో: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై రష్యా నిషేధం విధించింది. బోరిస్ జాన్సన్ రష్యాలోకి ఎంటర్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా వ్యతిరేకిస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి లిజ్ ట్రాస్ స్పందిస్తూ.. బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే, స్కాట్లాండ్ మినిస్టర్ నికోలా స్టర్జియన్‌తో పాటు మరో 13 మంది బ్రిటీష్ ప్రభుత్వాధికారులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. రష్యా సీనియర్ అధికారులపై బ్రిటన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో రష్యా కూడా ఆకస్మిక చర్యలకు పూనుకున్నది. తమ దేశంలోకి ఎంటర్ కాకుండా ఉండే నిషేధిత సభ్యుల విస్తృత జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు రష్యా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఆ దేశానికి చెందిన పలువురు నేతలపై రష్యా నిషేధం విధించిన విషయం తెలిసిందే.