Sonu Sood: మిరాకిల్ హౌజ్ వద్ద సోనూ సూద్.. నేపాల్ వరద సహాయంలో పాల్గొన్న నటుడు
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. నేపాల్ వరద బాధితలకు రిలీఫ్ మెటీరియల్ అందిస్తున్నారు. సోనూసూద్ ఛారిటీ క్లబ్ తరపున ఆయన సాయం చేస్తున్నారు. త్రిశూలీ నది ఒడ్డున వరదను తట్టుకుని నిలిచిన లైట్ గ్రీన్ హౌజ్ వద్దకు సోనూ సూద్ చేరుకున్నాడు.
కాట్మాండు: బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood).. నేపాల్ వరద బాధితలకు రిలీఫ్ మెటీరియల్ అందిస్తున్నారు. నేపాల్‌లో ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మంగళవారం నేపాల్ వెళ్లిన నటుడు సోనూ సూద్ ఇవాళ ఉదయం త్రిశూలీ బజార్‌ను విజిట్ చేశాడు. సోనూసూద్ ఛారిటీ క్లబ్ తరపున ఆయన సాయం చేస్తున్నారు. ఆగస్టు 26వ తేదీన సంభవించిన వరదల్లో త్రిశూలీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న త్రిశూలీ గ్రామం, బజార్ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కండ్ల ముందు చాలా విధ్వంసం జరిగిందని, దాని తీవ్రత మరీ అధికంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. త్రిశూలీ నదిలో బురద, బండరాళ్లతో కూడిన వరద పోటెత్తుతున్నా.. ఓ ఇళ్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఆ లైట్ గ్రీన్ హౌజ్‌ను ఇప్పుడు మిరాకిల్ హౌజ్‌గా పిలుస్తున్నారు. ఆ ఇంటి సమీపానికి నటుడు సోనూ సూద్ చేరుకున్నారు. వరదల సమయంలో ఆ మిరాకిల్ ఇళ్లు ఎలా సజీవంగా నిలిచిందో చూడవచ్చు అని అయన అన్నారు. ఆ ఇంట్లో ఆరుగురు పైకప్పుపై నిలుచుని ప్రాణాలు కాపాడుకున్నారు.
సుమారు 9 గంటలు శ్రమించిన తర్వాత తాము త్రిశూలీ ప్రాంతానికి చేరుకున్నట్లు సోనూ సూద్ చెప్పాడు. ఇక్కడ చాలా మంది ఇండ్లు , కుటుంబాలు కోల్పోయారని, వారిని చూస్తుంటే బాధేస్తుందన్నారు. చాలా కఠినమైన ప్రదేశాలకు చేరుకుని, వీలైనంత సహాయం చేయనున్నట్లు సోనూ సూద్ చెప్పాడు.
#WATCH | Nuwakot, Nepal: Bollywood actor Sonu Sood says, “The kind of destruction is in front of your eyes. It’s immense. You can see that green house, the miracle house, which survived during these floods. But the whole other side of the village has already been wiped out, and… https://t.co/wu7KC66zDj pic.twitter.com/SOlPa73624
— ANI (@ANI) September 2, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

