అబుజా, సెప్టెంబర్ 4: ఆఫ్రికా దేశం నైజీరియాలో బోకో హరామ్ మిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్లో చొరబడి ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 100మందికిపైగా గ్రామస్తులు మరణించారని రాష్ట్ర పోలీస్ అధికార ప్రతినిధి డంగస్ అబ్దుల్ కరీం బుధవారం మీడియాకు తెలిపారు. ఆదివారం యోబ్ రాష్ట్రంలో తార్మువా కౌన్సిల్ ఏరియాలో 50 మందికిపైగా తీవ్రవాదులు మోటార్ సైకిల్స్‌పై వచ్చి కాల్పులు జరిపారని, భవనాలకు నిప్పు పెట్టారని కరీం చెప్పారు. దేశంలో ఇస్లామిక్ చట్టాన్ని, షరియా పాలన తీసుకురావటమే లక్ష్యంగా బోకో హరామ్ నైజీరియాలో హింసకు పాల్పడుతున్నది.