కాఫౌంటైన్ : పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఉన్న కానరీ దీవుల్లో ఓ బోటు మిస్సైంది(Boat Missing). ఆ బోటులో సుమారు 200 మంది ఆఫ్రికా శరణార్ధులు ఉన్నారు. వారి కోసం స్పానిష్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. దక్షిణ సెనిగల్లోని కాఫౌంటైన్ నుంచి బోటు స్టార్ట్ అయినట్లు వాకింగ్ బోర్డర్స్ గ్రూపు పేర్కొన్నది. కానరీ దీవుల నుంచి ఆ నగరం దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ బోటులో అనేక మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ బోటు తరహాలోనే మరో రెండు బోట్లు కూడా డజన్ల సంఖ్యలో శరణార్ధుల్ని తీసుకువెళ్తున్నాయి. అయితే ఆ బోట్లు కూడా మిస్సైనట్లు తెలుస్తోంది. మొత్తం 300 మంది ఆచూకీలేకుండా పోయినట్లు స్పెయిన్ రెస్క్యూ అధికారులు చెబుతున్నారు.