లండన్: క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించటంలో హార్వర్డ్ సైంటిస్టులు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు దారితీసే రక్త పరీక్షను హార్వర్డ్ అనుబంధ సంస్థ ‘మాస్ జనరల్ బ్రిఘం’ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఒక సాధారణ రక్త పరీక్షతో 10 ఏండ్ల ముందే మెడ, తల భాగంలో వచ్చే క్యాన్సర్లను గుర్తించవచ్చునని పరిశోధకులు తేల్చారు. శరీరం లోపల, బయట ఏర్పడే చాలా రకాల క్యాన్సర్ కణతుల్లో అత్యధిక శాతం ‘హెచ్‌పీవీ’ (హ్యూమన్ పాపిల్లోమావైరస్) రకానికి చెందినవే. తల, మెడ క్యాన్సర్లలోనూ 70 శాతం హెచ్‌పీవీ రకానివే. దీన్ని ముందుగా గుర్తించేందుకు ‘హెచ్‌పీవీ-డీప్‌సీక్’ అనే లిక్విడ్ బయాప్సీ టూల్‌ను సైంటిస్టులు తయారుచేశారు. ఫలానా వ్యక్తి రక్తంలోని కణాల్లో క్యాన్సర్ డీఎన్ఏను ముందుగానే అంచనావేయటం ‘హెచ్‌పీవీ-డీప్‌సీక్’లో మూల సూత్రం. ఈ పద్ధతి ఇద్దరు రోగుల విషయంలో 99 శాతం కచ్చితత్వం చూపింది.