వాషింగ్టన్, సెప్టెంబర్ 3: గుండెపోటు ఎప్పుడొస్తుందో తెలియదు. అయితే 60 ఏండ్లకు ముందే గుండెపోటు వచ్చే అవకాశాలను పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. మన బ్లడ్ గ్రూపులకు, గుండెపోటు రావడానికి సంబంధం ఉన్నదని అమెరికా పరిశోధకులు గుర్తించారు. వీరి ప్రకారం ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం 16 శాతం ఎక్కువ ఉన్నది.
అయితే ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జన్యుపరమైన అధ్యయనం చేసి ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపారు. ‘బీ’ గ్రూప్ వారికి ‘ఓ’ గ్రూప్ వారికన్నా కాస్త ఎక్కువగానే గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. అయితే గుండెపోటు రావడంలో బ్లడ్ గ్రూప్ ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదని శాస్త్రవేత్త స్టీవెన్ కిట్నర్ తెలిపారు.