Huge Blast | టర్కీ పార్లమెంట్ భవనం వద్ద పేలుడు
టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో (Huge Blast) ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు.
అంకారా : టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో (Huge Blast) ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దుండగులు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వాహనంలో అంకారాలోని పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్దకు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్పడ్డారని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల్లో ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన ప్రాంతంలో టర్కీ పార్లమెంట్ సహా పలు మంత్రిత్వ శాఖల కార్యాలయాలున్నాయి.
అధ్యక్షుడు ఎర్దోగన్ ప్రసంగం నేపధ్యంలో టర్కీ పార్లమెంట్ నేడు తిరిగి ప్రారంభం కానున్న రోజే ఉగ్రవాదులు దాడికి తెగబడటం విశేషం. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకోగా, అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Read More :
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

