బ్యాంగ్కాక్: థాయిలాండ్ రాజధాని బ్యాంగ్కాక్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంఘటన చోటుచేసుకున్నది. ఆ పేలుడు ధాటికి ఎయిర్పోర్ట్ టర్మినల్ ఊగిపోయింది. ఈ ఘటనలో సుమారు 11 మంది గాయపడ్డారు. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ సమీపంలో ఆ ఫ్యాక్టరీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. పేలుడు వల్ల ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఇండ్ల కిటికీలు ధ్వంసం అయ్యాయి. గంటల కొద్దీ ఆ ప్రాంతంలో నల్ల పొగ కమ్ముకున్నది. ఫ్యాక్టరీ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది లీటర్ల కెమికల్స్ లీకయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఇంకా కొన్ని వేర్హౌజుల్లో అగ్ని ఎగసిపడుతున్నది. ఏ కారణం చేత పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు.