కేప్‌టౌన్, జూలై 3: క్యాటర్‌పిల్లర్ (గొంగళిపురుగు) నుంచి స్నాక్స్ తయారుచేసే విధానాన్ని రూపొందించారు దక్షిణాఫ్రికాకు చెందిన కెమికల్ ఇంజినీర్ వెండీ వెసెలా. నలుపు, ఆకుపచ్చటి రంగు పురుగుల్లో ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని, వాటిని తొలుత పిండిగా మార్చి, బిస్కెట్స్, చాక్లెట్లు వంటి స్నాక్స్ తయారుచేయొచ్చని ఆమె వివరించారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. వీటివల్ల పర్యావరణానికి ముప్పు లేదని చెబుతున్నారు.