కరోనా మహమ్మారి కొత్త రూపం ఒమిక్రాన్ ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మహమ్మారి గురించి తీవ్రంగా హెచ్చరించారు. మహమ్మారి ప్రమాదకర దశలోకి ప్రవేశించవచ్చునని చెబుతూ.. ఆయన అందరినీ వ్యాక్సిన్లు వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు, పండుగలు జరుపుకోవడం వంటివి మానుకోవాలని కోరారు.
ఒమిక్రాన్ గురించి ఆయన మాట్లుడుతూ.. కరోనా మిగతా వేరింట్ల కన్నా ఇది ప్రమాదకర వేరింయట్గా అవతరించవచ్చునని, ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అన్నారు.
గేట్స్ మంగళవారం ఒమిక్రాన్ గురించి ఒక ట్వీట్ చేశారు. అందులో “ప్రపంచమంతా సామాన్య స్థితికి చేరుకుంటుదని అందరూ అనుకుంటున్న సమయంలో.. మహమ్మారి అత్యంత ప్రమాదకర దశ వైపుకు వెళుతోంది. చాలా మంది నా స్నేహితులు ఒమిక్రాన్ బారిన పడ్డారు.. నేను కూడా నా హాలిడేస్‌ని రద్దు చేసుకున్నా. చరిత్రలో వెలుగుచూసిన అన్ని వైరస్ల కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. త్వరలోనే ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇది ప్రవేశిస్తుంది” అని రాశారు.
Just when it seemed like life would return to normal, we could be entering the worst part of the pandemic. Omicron will hit home for all of us. Close friends of mine now have it, and I’ve canceled most of my holiday plans.
— Bill Gates (@BillGates) December 21, 2021
మరొక ట్వీట్లో ఆయన ఒమిక్రాన్ వైరస్‌ని అందరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. “ఇంతకు ముందు వచ్చిన డెల్టా వేరింట్ కన్నా దీని ప్రభావం తక్కువగా ఉన్నా.. ఇది వ్యాప్తి చెందడంలో చాలా ప్రమాదకరంగా ఉంది. ‘ఒమిక్రాన్ వచ్చినా సీరియస్ కాదులే’ అని భ్రమలో ఉండొద్దు ఎందుకంటే దీని గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. అందుకే మనం దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని 2022లో అంతం చేయొచ్చు” అని చెప్పారు.