వాషింగ్టన్, జనవరి 30: అమెరికాలో విడుదల చేస్తున్న ఎప్స్టీన్ ఫైళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. యూఎస్‌లో శుక్రవారం మరో విడత విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైళ్లలో కొందరు ప్రముఖుల పేర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఫైళ్లలో 30 లక్షల పేజీలతో పాటు 2,000 వీడియోలు, 18,000 చిత్రాలు బహిరంగంగా ఉంచారు.
ఎప్స్టీన్ తాజా బ్యాచ్ ఫైళ్లలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత్‌కు చెందిన ప్రముఖ దర్శకురాలు, న్యూయార్క్ మేయర్ మమ్దానీ తల్లి మీరా నాయర్ తదితరులు ఉన్నారు. ఈ పైళ్లలో బిల్ గేట్స్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. రష్యన్ అమ్మాయిల నుంచి ఆయనకు లైంగిక సంక్రమణ వ్యాధి సోకిన విషయం కూడా అందులో ఉంది.
ఇక డొనాల్డ్ ట్రంప్ గురించి ఇందులో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సుమారు 25 ఏండ్ల క్రితం న్యూజెర్సీలో ట్రంప్ బలవంతంగా తన మిత్రురాలితో ఓరల్ సెక్స్ చేయించినట్టు ఒక విభాగంలో ఒక గుర్తు తెలియని స్నేహితురాలు నివేదించింది. పెగ్గీ సీగల్ పంపిన ఈ-మెయిల్లో మీరా నాయర్ గురించి ప్రస్తావించారు. ఈ ఫైళ్లలో ఆమె ప్రస్తావన ఉంది తప్ప ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవు.