న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్(Bill Gates).. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌కు సపోర్టు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. హ్యారిస్‌కు మద్దతు ఇస్తున్న ఓ ఎన్జీవో సంస్థకు బిల్ గేట్స్ 50 మిలియన్ల డాలర్లు విరాళం ఇచ్చినట్లు తెలిసింది. ఫ్యూచర్ ఫార్వర్డ్ అనే సంస్థకు ఆయన డోనేట్ చేశారు. అయితే దేశాధ్యక్ష పోటీలో ఉన్న రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్‌పై బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మిత్రులకు,ఇతరులకు ఆయన చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేశారు. ఒకవేళ ట్రంప్ ఎన్నికైతే, ఫ్యామిలీ ప్లానింగ్, గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్‌కు నిధులు తగ్గే అవకాశాలు ఉన్నట్లు గేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గేట్స్ వెల్లడించారు. నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికలు చాలా భిన్నమైనవని బిల్ గేట్స్ చెప్పారు. హెల్త్‌కేర్ వృద్ధి, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులపై స్పష్టమైన పోరాటం చేసే అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని బిల్ గేట్స్ తెలిపారు.