Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అస్వస్థత
Bill Clinton | అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్(75) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్.. స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తన సిబ్బందికి చెప్పాడు. దీంతో మాజీ

అమెరికా : అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్(75) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్.. స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తన సిబ్బందికి చెప్పాడు. దీంతో మాజీ అధ్యక్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడికల్ సెంటర్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లే క్లింటన్ అనారోగ్యానికి గురయ్యారని, ఇది వయసు పైబడిన వారిలో సాధారణంగా వచ్చే సమస్యే అని వైద్యులు స్పష్టం చేశారు. డాక్టర్ అల్పేస్ అమీన్, డాక్టర్ లిసా బార్డాక్ నేతృత్వంలో క్లింటన్‌కు చికిత్స కొనసాగుతోంది.
క్లింటన్‌కు 2004లో బైపాస్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. 2010లో రెండు స్టెంట్లు కూడా వేశారు. కానీ ఆయనకు ఎలాంటి గుండె సమస్య కానీ, కొవిడ్ ఇన్ఫెక్షన్ కానీ లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. 1993 నుంచి 2001 మధ్య అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింటన్ సేవలందించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

