Big Bang Theory | కాలిఫోర్నియా, ఆగస్టు 10: విశ్వం ఆవిర్భావం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సమాధానం కనుగొనేందుకు దశాబ్దాలుగా సైంటిస్టులు శోధిస్తున్నారు. మహా విస్ఫోటనం తర్వాత ప్రాథమిక మూలకాలు బోసన్ అనే రేణువుల సాయంతో ఒకదానితో ఒకటి ఢీకొని ద్రవ్యరాశి ఏర్పడిందనేది బిగ్ బ్యాంగ్(మహా విస్ఫోటనం) థియరీ. అయితే, ఈ సిద్ధాంతం తప్పు అయి ఉండవచ్చని మూలకాలు, దైవ కణాలు(హిగ్స్ బోసన్ పార్టికల్) ఆధారంగా చేసిన తాజా పరిశోధన చెప్తున్నది.
లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకుల వాదన ప్రకారం, ఒకవేళ నిజమే అయితే మహా విస్ఫోటనం జరిగిన వెంటనే విశ్వం అంతమయ్యేది. విశ్వం ఆవిర్భావానికి సంబంధించి అన్ని సిద్ధాంతాలూ తప్పే అయ్యి ఉండాలి. ప్రాథమిక మూలకాలు అనేవే లేకపోయి ఉండాలి. విశ్వ అవిర్భావానికి కారణమేదో భౌతిక శాస్త్రం తెలుసుకోలేకపోతున్నది.