Joe Biden | నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత ప్రచారం చేయలేను: జో బైడెన్
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ అభ్యర్థిత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆయన మరో ప్రకటన సంచలనానికి దారితీసింది.
Joe Biden | వాషింగ్టన్, జూలై 5: ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ అభ్యర్థిత్వంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆయన మరో ప్రకటన సంచలనానికి దారితీసింది. తనకు నిద్ర సరిపోవట్లేదని, రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి షెడ్యూల్ వద్దని తన పార్టీ వారిని ఆదేశించినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది.
వైట్‌హౌస్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్న గవర్నర్లు, వర్చువల్‌గా హాజరైన పార్టీ నేతలను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగిస్తూ తనకు తేలికైన పనిభారం, విశ్రాంతి అవసరమని ఆయన నొక్కిచెప్పారు. గత నెలలో ట్రంప్‌తో జరిగిన డిబేట్లో ఆయన తడబాటుకు గురవ్వడంతో డెమోక్రాట్లలో ఆందోళన వ్యక్తమైంది. విస్తృతంగా చేపట్టిన అంతర్జాతీయ పర్యటనల కారణంగా ఏర్పడిన అలసటతో తాను ఆ రోజు డిబేట్లో వెనుకబడ్డానని ఇప్పటికే బైడెన్ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

