వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నల్లజాతి మహిళ
Jean Pierre | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నల్లజాతీయులకు ఉన్నత పదవిని కట్టబెట్టారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా కరీన్ జీన్ పియర్‌ను (Jean Pierre) నియమించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నల్లజాతీయులకు ఉన్నత పదవిని కట్టబెట్టారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా కరీన్ జీన్ పియర్‌ను (Jean Pierre) నియమించారు. దీంతో ఉన్నత స్థాయి పదవిని చేపట్టనున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. అదేవిధంగా ఆ పదవిలో నియమించబడిన తొలి LGBTQ+ వ్యక్తి. (LGBTQ+.. లెస్బియన్, గే, bisexual, ట్రాన్స్‌జెండర్)
ప్రస్తుతం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా జెన్ పాకి పనిచేస్తున్నారు. ఈ నెల 13న ఆమె పదవీకాలం ముగియనుంది. జీన్ పియర్ ఇప్పుడు జెన్‌కు డిప్యూటీగా ఉన్నారు. కాగా, జీన్ పియర్‌ను ప్రెస్ సెక్రటరీగా నియమించడం గర్వంగా ఉందని జో బైడెన్ చెప్పారు. ఆమె అనుభవం, ప్రతిభ, సమగ్రత తమకు ఎంతగానో పనికొస్తాయన్నారు.
44 ఏండ్ల జీన్ పియర్.. వైట్ హౌస్‌లో బైడెన్ బృందంలో చేరడానికి ముందు 2008, 2012లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, 2020లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తరఫున ప్రచారం నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

