Genevieve Lhermitte: అయిదుగురు పిల్లల్ని చంపిన తల్లి.. ఇథనేషియా ద్వారా ప్రాణాలు తీసుకుంది
Genevieve Lhermitte: అయిదుగురు పిల్లల్ని చంపిన 16 ఏళ్ల తర్వాత ఆ కసాయి తల్లి తనకు తానుగా ప్రాణాలు వదులుకున్నది. ఇథనేషియా ద్వారా ఆమె మరణించింది. బెల్జియం ప్రభుత్వం అనుమతితోనే లెర్మిట్టే తన చావును కోరుకున్నది.
బ్రసెల్స్: అయిదుగుర్ని పిల్లల్ని చంపిన కేసులో 16 ఏళ్ల క్రితం జెనీవీవే లెర్మిట్టే(Genevieve Lhermitte) నఅనే మహిళను బెల్జియంలో అరెస్టు చేశారు. అయితే ఇథనేషియా(Euthenesia) ద్వారా ఆ మహిళ ప్రాణాలను బలి తీసకున్నది. ఇంజెక్షన్ ద్వారా ఆ మహిళ మరణించింది. 2007 ఫిబ్రవరిలో నివెల్లిస్ అనే పట్టణంలో లెర్మిట్టే తనకు పుట్టిన అయిదుగుర్ని పిల్లల్ని మర్డర్ చేసింది. ఓ కుమారుడితో పాటు నలుగురు అమ్మాయిలను ఆమె హతమార్చింది. తండ్రి ఇంట్లో లేనప్పుడు ఆ మహిళ ఆ దారుణానికి పాల్పడింది. ఆ పిల్లల వయసు మూడేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు ఉంటుంది.
ఆ ఘటన తర్వాత లెర్మిట్టే అనేక సార్లు బలవన్మరణానికి ప్రయత్నించింది. కానీ ఆమె సూసైడ్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పిల్లల్ని చంపిన కేసులో 56 ఏళ్ల ఆ మహిళకు 2008లోనే జీవిత ఖైదు శిక్ష పడింది. తీవ్ర మనోవేదనతో ఉన్న ఆమెకు 2019లో సైక్రియాట్రిక్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.
అయితే భరించలేని మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లు బెల్జియం(Belgium) చట్టాల ప్రకారం ఇథనేసియా పద్ధతిలో తమ ప్రాణాలను తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇంజెక్షన్ ద్వారా చావాలనుకుంటున్న ఆ వ్యక్తి పూర్తి స్పృహలో ఆ నిర్ణయం తీసుకుకోవాలి. తమ చావు నిర్ణయాన్ని స్పష్టమైన రీతిలో చెప్పుకోవాల్సి ఉంటుంది.
తనకు ఉన్న మానసిక సమస్యలకు చికిత్స ఇవ్వలేకపోయిన ఓ సైక్రియాట్రిస్టుపై 2010లో ఆమె మూడు మిలియన్ల దావా వేసింది. కానీ పదేళ్ల తర్వాత ఆ కేసును ఆమె వెనక్కి తీసుకున్నది. 2022లో బెల్జియంలో సుమారు 2966 మంది ఇథనేషియా పద్ధతిలో ప్రాణాలు విడిచారు. ఇది 2021తో పోలిస్తే 10 శాతం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

