కివ్: బెలారస్ ప్రతిపక్ష నేత మారియా కొలెష్నికోవాకు 11 ఏళ్ల జైలుశిక్ష పడింది. దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు వ్యతిరేకంగా గత ఏడాది ఆమె సామూహిక నిరసన ప్రదర్శలు నిర్వహించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ బోర్డర్ వద్ద దేశం విడిచి వెళ్తున్న కొలెష్నికోవాను అరెస్టు చేశారు. ఆమె పాస్‌పోర్ట్ సీజ్ చేశారు. మ్యూజిక్ స్టార్ అయిన మారియా తన నిరసన ప్రదర్శనలతో రాజకీయవేత్త అయ్యారు. అధికారం కోసం ఎన్నికల్లో లుకషెంకో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు మారియా ఆరోపించారు. 1994 నుంచి బెలారస్ అధ్యక్షుడిగా లుకషెంకో కొనసాగుతున్నారు. మరో సీనియర్ ప్రతిపక్ష నేత మాగ్జిమ్ జనాక్కు కూడా పదేళ్ల శిక్ష పడింది. లుకషెంకో ప్రభుత్వ వేలాది మందిని అరెస్టు చేసింది. ఇటీవల విమానాన్ని హైజాక్ చేసి మరీ ఓ జర్నలిస్టును అరెస్టు చేసింది. టోక్యోలో ఓ మహిళ అథ్లెట్ కూడా ఆ దేశానికి వెళ్లనంటూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.