Beggar Family Hosts Grand Feast | రూ.1.25 కోట్ల ఖర్చు చేసి.. భారీ విందు ఇచ్చిన బెగ్గర్ ఫ్యామిలీ
Beggar Family Hosts Grand Feast | అడుక్కుని జీవించే ఒక కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 20,000 మందికి భారీ విందు ఇచ్చింది. దీని కోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేసింది. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతోపాటు కోటీశ్వరులు షాక్ అయ్యారు.
ఇస్లామాబాద్: అడుక్కుని జీవించే ఒక కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 20,000 మందికి భారీ విందు ఇచ్చింది. దీని కోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేసింది. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతోపాటు కోటీశ్వరులు షాక్ అయ్యారు. (Beggar Family Hosts Grand Feast) పాకిస్థాన్‌లోని గుజ్రాన్వాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. స్థానికులను, తెలిసినవారిని దీనికి ఆహ్వానించింది.
కాగా, గుజ్రాన్వాలాలోని రహ్వాలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ విందు కార్యక్రమం జరిగింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది హాజరయ్యారు. సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు వివిధ మాంసాహార వంటకాలను వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కోశారు. అలాగే అతిథులను తరలించేందుకు సుమారు 2,000 వాహనాలు కూడా ఏర్పాటు చేశారు.

Beggar Family Hosts Grand F
మరోవైపు ఈ భారీ విందు కోసం ఆ బెగ్గర్ ఫ్యామిలీ సుమారు రూ.1.25 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయం తెలిసి స్థానికులతోపాటు ధనవంతులు, కోటీశ్వరులు సైతం నోరెళ్లబెట్టారు. ఒక బిచ్చగాడి కుటుంబం ఇంత విలాసవంతమైన విందు ఇవ్వడంపై చాలా మంది హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. కొందరు వారి ఔదార్యాన్ని మెచ్చుకోగా, వారి ఆర్థిక పరిస్థితిపై మరికొందరు ఆశ్చర్యపోయారు. ఈ విందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అడుక్కునే ఒక కుటుంబం భారీ విందు ఇవ్వడంతోపాటు దానికి కోట్లలో ఖర్చుచేయడంపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది.
Beggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯
Thousands of people attended the ceremony.
They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 2024
گوجرانوالہ میں جھگی واسوں کینگرہ برادری کے بچوں نے اپنی والدہ کے چالیسویں کی تقریبات کو تاریخی بنا دیا
گوجرانوالہ جھگی واسوں کے چھے بچوں نے اپنی والدہ کے چالیسویں کی تقریب پر سوا کروڑ روپے خرچ کیے، 120 سالہ سکینہ بی بی کے 40 ویں کی تقریب میں250 بکرے بھی ذبح کیے گئے۔ چالیسویں کی… pic.twitter.com/ceoevkgd9M
— 365 News (@365newsdotpk) November 15, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

