Grand Feast | లాహోర్: పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది కానీ, అక్కడి బిచ్చగాళ్లు ఆస్తిపరుల్లాగానే కనిపిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్, గుజ్రాన్వాలాలో, రాహ్వలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బిచ్చగాడి కుటుంబం ఇచ్చిన విందు సంపన్నులను సైతం అవాక్కయ్యేలా చేసింది.
బిచ్చగాడి నాన్నమ్మ మరణించడంతో, 40వ రోజున సుమారు 20 వేల మందిని ఆహ్వానించి, నోరూరించే అనేక రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. దీని కోసం 1.25 కోట్ల పాకిస్థానీ రూపాయలు ఖర్చు చేశారు. అతిథులను తరలించడానికి సుమారు 2,000 వాహనాలను ఉపయోగించారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.