న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆరంభంలో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం( F-35 Fighter Jet) నేలకూలిన విషయం తెలిసిందే. అది కూలిన సమయంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అలస్కాలో రన్‌వేపై అది కూలింది. ఎలిసన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో కూలి, పేలిన ఆ ఘటనకు చెందిన వీడియో రిలీజైంది. అయితే ఆ ప్రమాదానికి చెందిన రిపోర్టను తాజాగా రిలీజ్ చేశారు. జనవరి 28వ తేదీన ఆ దుర్ఘటన జరిగింది. ఆ ప్రమాదానికి ముందు.. ఫైటర్ జెట్ కూలకుండా ఉండేందుకు దాని పైలట్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఇంజినీర్లతో ఆ సమయంలో అతను మాట్లాడాడు. సుమారు 50 నిమిషాల పాటు ఆ ఫైటర్‌ను సరి చేసేందుకు పైలట్ ట్రై చేశాడు. చివరకు సుడులు తిరుగుకుంటూ ఆ విమానం పేలుతూ కూలింది. కానీ ఈ ప్రమాదం నుంచి పైలట్ తృటిలో తప్పించుకున్నాడు. పారాచూట్ సాయంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు.
టేకాఫ్ తీసుకున్న తర్వాత ల్యాండింగ్ గేర్‌ను సరిచేయడంలో ఆ పైలట్ ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రయత్నంలో విఫలం అయ్యాడు. ముక్కు భాగంలో ఉన్న హైడ్రాలిక్ లైన్స్ లో ఐస్ చిక్కుకుపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు పైలట్.. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీకి చెందిన అయిదుగురు ఇంజినీర్లతో మాట్లాడారు. వారితో మాట్లాడుతూనే ఫైటర్ జెట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు.
రెండుసార్లు ల్యాండింగ్ కోసం ట్రై చేశాడు. ముక్కు భాగంలో ఐస్ జామ కావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ల్యాండింగ్ గేర్లు మొత్తం ఫ్రీజ్ కావడంతో ఆ యుద్ధ విమానం అనుకున్నట్లు దిగలేకపోయిందని రిపోర్టులో తెలిపారు. విమానం నేలమీదే ఉన్నట్లు జెట్ సెన్సార్లు పేర్కొన్నాయని, దీంతో ఆ యుద్ధ విమానాన్ని కంట్రోల్ చేయడం రాలేదని, ఫలితంగా పైలట్ బలవంతంగా ఎజక్ట్ కావాల్సి వచ్చినట్లు రిపోర్టులో రాశారు.
వారం రోజుల తర్వాత ఇదే బేస్‌కు చెందిన మరో యుద్ధ విమానంలోనూ హైడ్రాలిక్ ఐసింగ్ సమస్యలు వచ్చాయి. కానీ ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అయితే జనవరి 28వ తేదీన ఎఫ్-35 కూలిన రోజు మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల సుమారు 200 మిలియన్ల ఫైటర్ జెట్ ధ్వంసమైంది. హైడ్రాలిక్స్ సర్వీసింగ్‌లో సమస్యల వల్లే ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌ఫోర్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు పేర్కొన్నది.
🚨 F-35 CRASH IN ALASKA ❄️
A $196.5M USAF F-35A went down at Eielson AFB after its landing gear froze in subzero temps
Pilot spent 50 mins on call with Lockheed engineers, tried 2 landings ice buildup made jet uncontrollable mid-air. He ejected safely #F35 #AlaskaSummit pic.twitter.com/7FzfP4RIFL
— Hindustan (@InsideHindustan) August 27, 2025