ఆకాశమంటేనే అద్భుతాలకు నిలయం. మనకు అంతుచిక్కని రహస్యాలెన్నో అక్కడ దాగి ఉంటాయి. చైనాలోని హైకౌ సిటీ అరుదైన దృగ్విషయానికి కేంద్రంగా మారింది. ఆ నగరంలో ఇటీవల ఆకాశంలో ఇంద్ర ధనుస్సు రంగులో మేఘం కనిపించింది. రంగురంగుల్లో మెరిసిపోతున్న మేఘాన్ని చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే తమ ఫోన్లు, కెమెరాలను చేతిలోకి తీసుకొని అరుదైన దృశ్యాన్ని బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
క్యుములోనింబస్ మేఘాల విస్తరణ వల్ల ఈ ఇంద్ర ధనుస్సులాంటి మేఘాలు ఏర్పడతాయి. దీనిని ‘పైలస్ క్లౌడ్’ అని పిలుస్తారు, ‘క్యాప్ క్లౌడ్’ లేదా ‘హుడ్ క్లౌడ్’ అని కూడా అంటారు. ఒక మేఘం వేగంగా పైకి వెళ్తున్నప్పుడు క్యుములస్ పైన స్థిరమైన పొరలో విశ్రాంతి తీసుకునేటప్పుడు మేఘంలో ఇంద్ర ధనుస్సులాంటి ప్రభావం ఏర్పడుతుంది. సాధారణంగా, ఇది కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ ఒరిజినల్ వీడియోను ‘సన్లైట్ రెయిన్’ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.
i wonder if 🌎 is special or if most planets offer as much of a magnificient view #earth https://t.co/8dfbsT1gkY
— zaksorel (@zaksorel) August 29, 2022