ఎలుగుబంటిని చూస్తే చాలామంది పారిపోతారు. అవి కనిపిస్తే చాలు అక్కడినుంచి జంప్ అవుతారు. కాగా, ఓ ఎలుగుబంటి కారులో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి మరీ హై ఫైవ్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వ్యక్తికి ఎలుగుబంటి ఎలా హై ఫైవ్ ఇచ్చింది? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోను ‘ప్యుబిటీ’ అనే యూజర్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారులో కూర్చొని ఉండగా, పక్కనుంచి మూడు ఎలుగుబంట్లు వెళ్తూ ఉంటాయి. అంతలోనే ఒక ఎలుగుబంటి కారు వద్దకు వెళ్లి వ్యక్తికి హై ఫైవ్ ఇచ్చింది. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. ఈ చిన్న వీడియోను ఇప్పటివరకూ 17 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. 1.5 మిలియన్ల లైక్స్ కూడా వచ్చాయి.