బ్యాంకాక్: బీచ్‌లో మహిళ మృతదేహాం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వైద్య బృందంతో కలిసి హడావుడిగా చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న దానిని చూసి షాకయ్యారు. అచ్చం అందమైన యువతిగా పడి ఉన్నది సెక్స్ డాల్ అని గుర్తించారు. థాయ్‌లాండ్‌లోని చోన్బురిలోని బ్యాంగ్ సేన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 18న అక్కడి బీచ్‌లో ఒక మహిళ నగ్నంగా బోర్లా పడి ఉండటాన్ని సందర్శకులు చూశారు. సముద్రం నుంచి మృతదేహం కొట్టుకొని వచ్చిందని అనుమానించారు. భయాందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే ఆ బీచ్ వద్దకు చేరుకున్నారు. దూరం నుంచి చూసి నిజంగా మహిళ నగ్నంగా బొర్లాపడి ఉన్నట్లుగా భావించారు. వెంటనే ఆ ప్రాంతం చుట్టూ టేప్ వేసి అక్కడకు ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. అయితే దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. యువతి మాదిరిగా అక్కడ పడి ఉన్నది సెక్స్ డాల్‌గా గుర్తించారు. మహిళను తలపించేలా ఉన్న ఆ సిలికాన్ బొమ్మకు తల లేదని చెప్పారు. ఎవరో కాలువలో పడేసి ఉంటారని, అది సముద్రంలోకి వచ్చి బీచ్‌లోకి కొట్టుకొచ్చి ఉంటుందని భావించారు. జపాన్‌కు చెందిన ఆ హైపర్ రియలిస్టిక్ ఏవీ సెక్స్ డాల్ విలువ 500 డాలర్లు (సుమారు రూ.40,000) ఉంటుందని తెలుస్తున్నది.