బీబీసీకి యూకే సమర్థన
ప్రధాని మోదీపై బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీపై యూకే ప్రభుత్వం స్పందించింది. దాని చర్యను సమర్థించిన యూకే.. భావ వ్యక్తీకరణలో బీబీసీ పూర్తి స్వతంత్రత కలిగిన మీడియా సంస్థ అని వ్యాఖ్యానించింది.
లండన్, ఫిబ్రవరి 2: ప్రధాని మోదీపై బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీపై యూకే ప్రభుత్వం స్పందించింది. దాని చర్యను సమర్థించిన యూకే.. భావ వ్యక్తీకరణలో బీబీసీ పూర్తి స్వతంత్రత కలిగిన మీడియా సంస్థ అని వ్యాఖ్యానించింది. ఇది తమ దేశాల మైత్రిపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. భారత్తో తమ సంబంధాలు పూర్తి స్థాయిలో కొనసాగుతాయని స్పష్టం చేసింది.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రతినిధి ఎకోయడ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తమ దేశ విదేశీ శాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ పార్లమెంట్లో చేసిన ప్రకటన గురించి వివరించారు. గత వారం పార్లమెంట్లో ఒక సభ్యుడు దీనిపై ప్రశ్నించారని వెల్లడించారు. ‘బీబీసీ అనేది ఒక స్వతంత్ర మీడియా సంస్థ. అది తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలదు. అయితే భారత్ తమకు అంతర్జాతీయంగా ముఖ్యమైన భాగస్వామి’ అని జేమ్స్ ప్రకటించారని వివరించారు. దానితో పాటు పలు అంశాలపై భారత హై కమిషనర్ విక్రమ్ దొరస్వామితో మాట్లాడినట్టు చెప్పారని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

